ఆసరా’తో ఆదుకుంటాం

ఆసరా'తో ఆదుకుంటాం






వైద్య ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక చర్యలకు నాంది పలుకుతున్నాం


'డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా' పథకం ప్రారంభోత్సవంలో సీఎం వైఎస్‌ జగన్‌


జనవరి 1 నుంచి ఆరోగ్యశ్రీ కొత్త కార్డులు జారీ 


ఏప్రిల్‌ 1 నుంచి 1,060 నూతన అంబులెన్స్‌లు 


అందరికీ 'వైఎస్సార్‌ కంటి వెలుగు'


చికిత్సానంతరం రోజుకు రూ. 225, గరిష్టంగా నెలకు రూ. 5 వేలు 


వైద్యుల సిఫార్సు మేరకు  రోగికి జీవనోపాధి భృతిని ఎన్నాళ్లయినా అందిస్తాం


రూ.13 వేల కోట్లతో కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వాస్పత్రుల అభివృద్ధి 


ప్రభుత్వాస్పత్రుల్లో  510 రకాల మందులు 15 నుంచి అందుబాటులోకి


జనవరి 1 నుంచి 1,200 చికిత్సలకు విస్తరించనున్న ఆరోగ్యశ్రీ 


ఏప్రిల్‌ నాటికి ఆరోగ్యశ్రీలో 2,000 చికిత్సలు.. పైలెట్‌ ప్రాజెక్టుగా జనవరి నుంచే పశ్చిమ గోదావరిలో అమలు








మంచి పాలన అందుతున్నప్పుడు, వేలెత్తి చూపించే పరిస్థితులు ఏవీ లేనప్పుడు చిన్నచిన్న వాటిని, మనకు సంబంధం లేని అంశాలను కూడా పెద్ద సమస్యలుగా చూపించే ప్రయత్నాలు ఇవాళ జరుగుతున్నాయి. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు పన్నినా గట్టిగా నిలబడతా. మీ అందరి దీవెనలు, దేవుడి దయ... వీటిమీదే నేను గట్టిగా నమ్మకం ఉంచా. మొదటి నుంచి కూడా వీటినే నమ్ముకున్నా. ఈరోజు కూడా మిమ్మల్నే, దేవుడినే నమ్ముకుంటా..
– సీఎం జగన్‌