అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్‌ దంపతుల మృతి..

డల్లాస్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భారతదేశానికి చెందిన ఇద్దరు దంపతులు సహా వారి బంధువు ఘటనా స్థలంలోనే మరణించారు. డల్లాస్‌ నగరం నుంచి ప్రిస్కోకు భారతీయులు వెళ్తున్న కారు టెక్సాస్‌ వద్ద లెఫ్ట్‌ టర్న్‌ తీసుకుంటుండగా.. ఎదురుగా దూసుకొచ్చిన ఓ ట్రక్‌ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న దివ్య ఆవుల(34), ఆమె భర్త రాజా(41), వారి బంధువు ప్రేమ్‌నాథ్‌(42) స్పాట్‌ మృతి చెందారు. మృతులు.. భారత్‌లోని హైదరాబాద్‌ నగరానికి చెందినవారుగా టెక్సాస్‌ పోలీసులు నిర్ధారించారు. నగరంలోని ముషీరాబాద్‌, గాంధీనగర్‌ కాలనీకి చెందిన ఆవుల దివ్య, రాజా, ప్రేమ్‌నాథ్‌లుగా అమెరికా అధికారులు తెలిపారు. దివ్య, రాజా దంపతులకు ఆరేళ్ల కూతురు ఉంది.