రూ. 1 కోటి 25 లక్షల విరాళం ప్రక‌టించిన నందమూరి బాలకృష్ణ

కరోనా నివారణా చర్యలకు, సినీ కార్మిక సంక్షేమానికి నంద‌మూరి బాల‌కృష్ణ రూ.1 కోటి 25 ల‌క్షల విరాళాన్ని ప్ర‌క‌టించారు. తెలుగు రాష్ట్రాల‌లో కరోనా ప్ర‌భావం తీవ్రంగా ఉన్న నేప‌థ్యంలో ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవ‌డానికి బ‌స‌వ‌తారకం ఇండో అమెరిక‌న్ క్యాన్స‌ర్ హాస్పిట‌ల్ మ‌రియు రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఛైర్మ‌న్ నంద‌మూరి బాలకృష్ణ రూ.50 ల‌క్ష‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం స‌హాయ‌నిధికి, రూ.50 ల‌క్ష‌లు తెలంగాణ సీఎం స‌హాయ‌నిధికి అంద‌జేయ‌నున్నట్టు పేర్కొన్నారు 


లాక్ డౌన్ కార‌ణంగా ఎంతో ఇబ్బంది ప‌డుతున్న తెలుగు సినీ కార్మికుల స‌హాయార్ధం 25 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ని క‌రోనా క్రైసిస్ ఛారిటీ(సిసిసి) ఎగ్జిగ్యూటివ్ మెంబ‌ర్ సి క‌ళ్యాణ్‌కి అందించారు బాల‌కృష్ణ. క‌రోనాపై పోరాటానికి త‌న వంతు బాధ్య‌త‌గా ఈ విరాళాన్నిఅందిస్తున్న‌ట్టు పేర్కొన్నారు. ఈ విప‌త్తు స‌మ‌యంలో ప్ర‌తి ఒక్క‌రు స్వీయ నియంత్ర‌ణ పాటిస్తూ, క‌రోనాని అరిక‌ట్ట‌డంలో భాగ‌స్వాములు కావాల‌ని పేర్కోన్నారు.